NTV Telugu Site icon

Home Minister AP : పోలీసులకు రాజకీయాలు వద్దు… మీ డ్యూటీ చేయండి

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: నేడు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై మంత్రి మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింది., పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని., పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదంటూ ఆవిడ మాట్లాడారు. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని. విశాఖలో ఆరిలోవ పోలీసు స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్ల కింద ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడు పొలీసు రిక్రూట్మెంట్ చాలా అవసరం ఉంది. వ్రాత పరీక్షతో మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటూ పోలీసులను చేసేసారని., పోలీసులు అంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉందని ఆమె పేర్కొంది.

Bhatti Vikramarka : ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం.. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరు

సీఐడీ నిన్నటి వరకూ ఎలా పని చేసిందో అందరికీ తెలుసునని., పీపుల్ పార్టనర్ షిప్ తో పోలీసు డిపార్ట్మెంట్ లో మార్పులు తెచ్చే దిశగా చర్చించాం అని అది డిజిపి అధ్యక్షతన మా సమావేశం జరిగిందని ఆమె తెలిపారు. పోలీసు అంటే ఎవరూ భయపడకూడదు.. ఏ కష్టమైనా చెప్పుకోవచ్చనే ధీమా రావాలి.. పోలీసులకు, పబ్లిక్ కి మధ్యలో సరైన సంబంధాలు ఉండాలి.. 16 నుండి 21 సంవత్సరాల వయసు మధ్య మహిళలు మిస్సింగ్ లో ఉంటున్నారని ఆవిడ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి తో కూడా చర్చిస్తామని ఆవిడా పేర్కొన్నారు. అక్రమ కేసుల విషయంలో కూడా కమిటీ వేసి పూర్తి విచారణ చేసే ప్రయత్నం చేస్తామని ఆవిడ అన్నారు.

Asian Nithiin Sitara : కల్కి మూవీతో నితిన్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్

ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ప్రక్షాళన మొదలైంది. దిశ పోలీసు స్టేషన్లు కూడా పేరు మార్చి ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నాం. మహిళా రక్షణ, గంజా విషయంలో ఒక టోల్ ఫ్రీ నంబరు ఇస్తాం. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని ఆవిడ అన్నారు. విశాఖ సిపి కార్యాలయం తాకట్టులో ఉందని., NDA కార్యకర్తలు అందరూ చంద్రబాబు మాటకి విలువ ఇచ్చి ఆగారని., రాష్ట్రం మొత్తం చెక్ చేసుకుంటే ఎవరి కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయో తెలియదంటూ.. పోలీసులకు రాజకీయాలు వద్దు.. మీ డ్యూటీ చేయండి అంటూ ఆమె పేర్కొంది.