NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి టీం పై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

Kalki

Kalki

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో  స్పీడ్ పెంచింది.ఇప్పటికే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని(రోబోటిక్ కార్ )ని మేకర్స్ ప్రేక్షకులకి పరిచయం చేసారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకంగా వుండనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

Read Also :Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ అప్డేట్ వైరల్..

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ సినిమా ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.ఈ ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ అలాగే కమల్ ,అమితాబ్ లుక్స్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చాయి.దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాపై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హాలీవుడ్ ఇల్యూస్ట్రేటర్ , కాన్సెప్ట్ ఆర్టిస్ట్ అయిన సుంగ్ చోయ్ తన ఆర్ట్‌వర్క్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌లో ఉపయోగించినట్లుగా సంచలన ఆరోపణలు చేసారు.దానికి సంబందించిన ప్రూఫ్ ను కూడా ఆయన రిలీజ్ చేసారు.సుంగ్ చోయ్ మార్వెల్ స్టూడియోస్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ మొదలైన వాటికి కాన్సెప్ట్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసారు. తన వర్క్ ను అనుమతి లేకుండా వారి సినిమాలో ఉపయోగించడం చెడ్డ పద్ధతి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments