Site icon NTV Telugu

Sean Penn: ఆస్కార్ అవార్డును గిఫ్ట్‎గా ఇచ్చేసిన హాలీవుడ్ స్టార్

Sean Penn

Sean Penn

Sean Penn: జీవితంలో ఆస్కార్ అవార్డ్ అందుకోవాలని ప్రతి నటుడు కలగంటూ ఉంటాడు. అలాంటి అవార్డును హాలీవుడ్ స్టార్ హీరో గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన పనికి పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అమెరికాకు చెందిన హాలీవుడ్ స్టార్ హీరో సీన్ పెన్ తన ఆస్కార్ అవార్డులలో ఒకదానిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని ధృడపరుస్తూ జెలెన్ స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెన్‌తో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు.

Read Also: lohitashwa prasad: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత

ఉక్రెయిన్ రాజధాని కైవ్ సందర్శించిన సీన్ పెన్ ఆ దేశ అధ్యక్షుడైన జెలెన్ స్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు ఈ క్రమంలో ఆయన దేశ పరిస్థితులపై కాసేపు జెలెన్ స్కీతో ముచ్చటించారు. అదే సమయంలో జెలెన్ స్కీ తమ దేశ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్‌’ పురస్కారాన్ని పెన్‎కు ప్రదానం చేశారు. సీన్ పెన్ ప్రపంచ స్థాయి నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు. మార్చిలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత హాలీవుడ్ నటుడు తన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సీన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో తన సమావేశాలపై మాట్లాడారు. దాడికి ముందు, తర్వాత ఆయనను కలిశానని చెప్పారు. ధైర్యం, గౌరవం, ప్రేమతో జెలెన్ స్కీ ఉక్రెయిన్ ను ఏకం చేని అందరినీ ఆకట్టుకున్నారని కొనియాడారు. ఇలాంటి విషయం ఆధునిక ప్రపంచంలో ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డాడు.

Exit mobile version