NTV Telugu Site icon

Cyclone Michaung: తుఫాన్‌ ఎఫెక్ట్‌.. రేపు ఏపీలోని ఆ జిల్లాల్లో సెలవు

Holidays

Holidays

Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటిన మిచౌంగ్‌ తుఫాన్‌ విధ్వంసమే సృష్టించింది.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం మిగ్చింది.. భారీగా పంట నష్టం జరగడంతో రైతులు లభోదిబోమంటున్నారు.. ఇక, కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇక, తుఫాన్‌ నేపథ్యంలో రేపు అనగా డిసెంబర్‌ 6వ తేదీ బుధవారం రోజు కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.. తుఫాను కారణంగా విస్తారంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న దృష్ట్యా బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించారు..

Read Also: Venkata Ramana Reddy: బండి సంజయ్ ను కలిసిన కామారెడ్డి విన్నర్

తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో బుధవారం కూడా స్కూళ్లకు, కాలేజీలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నెల్లూరు మొదలుకుని కాకినాడ మధ్యనున్న అన్ని జిల్లాలకు రేపు సెలవుగా ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, తుఫాను తీరం దాటినప్పటికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. కొండ చరియలు విరిగి పడే అవకాశం వున్న ప్రదేశాలను గుర్తించి సమీప నివాసితులను అప్రమత్తం చేయాలని సూచించారు.. కాగా, మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఎఫెక్ట్ తో సముద్ర తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి.. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.తుఫాన్ ప్రభావం ఏపీలోనే కాకుండా చెన్నైలో కూడా ఉంది..