Bomb threat to Sampark Kranti Express: దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న బీహార్ సంపర్క్ క్రాంతిలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ప్రయాణికులతో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు రైలును గోండా రైల్వే స్టేషన్‌లో హడావిడిగా నిలిపివేశారు. బాంబు బెదరింపు సమాచారం అందుకున్న గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2 ఏఎస్పీలు, 1 సివిల్ పోలీస్, సిటీ పోలీస్ స్టేషన్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైలు స్టేషన్‌కు చేరుకుని బాంబు కోసం వెతకడం ప్రారంభించారు. RPF, GRP సిబ్బంది కూడా రైలులోని అన్ని బోగీలను తనిఖీ చేసారు.
Also Read: Unique Tradition: వైరెటీ సంప్రదాయం.. ఆవుల మందతో తొక్కించుకుంటున్న యువకులు
సమాచారం ప్రకారం, రైలు గత గంటగా గోండా స్టేషన్‌లో నిలబడి ఉంది. చాలా మంది ప్రయాణికులు రైలు దిగిన తర్వాత స్టేషన్‌లో నిలబడి ఉన్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ, తనిఖీల్లో ఎలాంటి అనుమానాలు ఉన్న వాటిని గుర్తించలేదు అధికారులు. పోలీసులు, జీఆర్పీ బృందాలు ఒక్కో బోగీకి వెళ్లి ప్రజలను విచారించి సరుకులను తనిఖీ చేసారు. గత కొన్ని నెలలుగా రైళ్లు, స్టేషన్లకు బాంబులు పెట్టి బెదిరించే ఘటనలు అనేకం చూస్తున్నాము. అక్టోబర్ 30న రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో ముప్పు ఉన్న దృష్ట్యా స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను తనిఖీ చేశారు. దీంతో పాటు ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా తనిఖీ చేశారు. అయితే పోలీసులు, GRP తనిఖీలలో స్టేషన్లో ఎటువంటి పేలుడుకి సంబంధించిన వాటిని కనుగొనబడలేదు.
Also Read: Traffic Diversions: సదర్ ఉత్సవ్ మేళా.. రెండు రోజులు ఆ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ..