HMDA : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట నియోపోలీస్ భూముల విలువ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) దశలవారీగా నిర్వహిస్తున్న భూవేలాలకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించి ₹2,708 కోట్లు సంపాదించిన HMDA, నేడు మూడో విడత వేలానికి సిద్ధమైంది. ఈరోజు ప్లాట్ నంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ జరగనుంది. గత విడతల్లో ఎకరాకు ₹151.25 కోట్లు పలికిన రికార్డు ధర ఈసారి కూడా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేయాలని HMDA నిర్ణయించింది. ఇందులో కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలు ఉన్నాయి. ఇటీవల ఈ నెల 25, 28 తేదీల్లో జరిగిన వేలాల్లో కోకాపేటలోని 19 ఎకరాలకు వేలం పూర్తి కాగా, మిగిలిన భూములకు దశలవారీగా ఆక్షన్లు కొనసాగుతున్నాయి. వచ్చే డిసెంబర్ 5న కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు వేలం జరగనుంది. రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ ధరలు రావచ్చని HMDA భావిస్తోంది.
Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ
