NTV Telugu Site icon

HMD Skyline Price: హెచ్‌ఎండీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్‌ చేసుకోవచ్చు!

Hmd Skyline

Hmd Skyline

HMD Skyline 5G Mobile Price in India: ఫిన్లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘హెచ్‌ఎండీ’ సొంత బ్రాండ్‌పై కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘హెచ్‌ఎండీ స్కైలైన్‌’ పేరిట 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో ఆకర్షణీయమైన లుక్‌లో ఆవిష్కరించింది. డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్‌ చేసే సదుపాయంతో హెచ్‌ఎండీ స్కైలైన్‌ను తీసుకురావడం గమనార్హం. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను చూద్దాం.

హెచ్‌ఎండీ స్కైలైన్‌ ఫోన్‌ ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.35999గా కంపెనీ నిర్ణయించింది. నియోన్‌ పింక్‌, ట్విస్టెడ్‌ బ్లాక్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. హెచ్‌ఎండీ వెబ్‌సైట్‌, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. కస్టమ్‌ బటన్‌తో దీన్ని తీసుకొచ్చింది. హెచ్‌ఎండీ స్కైలైన్‌ సెల్ఫ్‌ రిపేర్‌ కిట్‌తో వస్తోంది. డిస్‌ప్లే డ్యామేజ్‌ అయినప్పుడు.. బ్యాక్‌ ప్యానల్‌ సాయంతో డిస్‌ప్లేని మార్చుకోవచ్చు.

Also Read: Motorola Edge 50 Neo: సెప్టెంబర్‌ 24 నుంచి అమ్మకాలు.. 2 వేల డిస్కౌంట్‌, 10 వేల ప్రయోజనాలు!

హెచ్‌ఎండీ స్కైలైన్‌లో 6.55 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ పోలెడ్ స్క్రీన్‌ ఉంది. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్షన్‌తో వస్తోన్న ఈ ఫోన్.. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా ఇది పనిచేస్తుంది. వెనకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో సెన్సర్‌, 13ఎంపీ సెన్సర్‌ను అమర్చారు. సెల్ఫీ కోసం 50 ఎంపీ కెమెరా ఉంది. 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్స్ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 48 గంటల పాటు ఫోన్‌ను ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఫోన్‌ ఛార్జర్‌తో రాదు. లాంచ్ ఆఫర్‌లో ఉచితంగా ఛార్జర్‌ను ఇస్తున్నారు.

Show comments