Site icon NTV Telugu

Dulam Nageswara Rao: దూలం నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన చిన్న కోడలు..

Dulam

Dulam

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు స్వాతి ఇంటింటి ప్రచారం చేస్తూ రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయమని ఓట్లర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముదినేపల్లి మండలంలో వైఎస్సార్ సీపీకి స్పందన బాగుందని ఇంటింటికి తిరుగుతు ఓట్ల అభ్యర్థిస్తుంటే జగనన్న మేనిఫెస్టో చాలా బాగుందని వారు చెబుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. మహిళలు ముందుకు వచ్చి దూలం నాగేశ్వరరావుకు తాము అండగా ఉంటామని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేసి ఎంపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ ను,
ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావును గెలిపించమని దూలం స్వాతి కోరారు.

Read Also: Vijay Thalapathy : విజయ్ దళపతి మూవీలో ఆ సీనియర్ హీరోయిన్..?

అలాగే, మండవల్లి మండలం ముడతలపాడులో ప్రజా ఆశీర్వాద యాత్రను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చాలా బాగుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అనగానే జగనన్న రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రిలీజ్ చేశారన్నారు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నుంచి అందరు నాయకులు వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూస్తే జగన్ చెప్పిందే చేస్తాడు అనే విధంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వెల్లడించారు.

Exit mobile version