Hindus allowed to worship in Gyanvapi mosque basement by Varanasi court: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేసి.. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ పేర్కొంది. ఇది హిందువుల అతిపెద్ద విజయమని కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ వెల్లడించింది.
Read Also: Rahul Gandhi: మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దాడి..
జ్ఞాన్‌వాపి మసీదు లోపల మూసివున్న ‘వ్యాస్ కా టెఖానా’ లోపల పూజలు చేసేందుకు వారణాసి కోర్టు హిందూ భక్తులను అనుమతించింది. రాబోయే 7 రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని కోరింది. వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేలమాళిగలో పూజించడానికి అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు లోపల మూసివున్న ‘వ్యాస్ కా టెఖానా’లో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా, రాబోయే ఏడు రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.
హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వ్యాస్ కా టెఖానా’లో ప్రార్థనలు చేసేందుకు హిందూ పక్షం అనుమతించింది. జిల్లా యంత్రాంగం 7 రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుంది. పూజ చేయండి అంటూ వ్యాఖ్యానించారు.
