NTV Telugu Site icon

Hindupur: హిందూపురంలో ఉత్కంఠకు తెర.. టీడీపీ కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నిక

Bala

Bala

Hindupur: హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 23 మంది మద్దతుతో టీడీపీకి చెందిన కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో వైసీపీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ పార్టీ తన కౌన్సిలర్లకు విప్ జారీ చేసినప్పటికీ, 17 మంది మాత్రమే మద్దతు పొందడం విశేషం.ఈ ఎన్నికలో టీడీపీ నాయకత్వం కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో.రమేష్ గెలుపు సాధించారు. దీనితో వైసీపీకు మున్సిపల్ ఛైర్మన్ పగ్గాలు దక్కలేదు.

Also Read: Anited Airlines: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా మంటలు

ఉదయం పది గంటల తర్వాత ప్రారంభమైన ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే, చివరకు చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపూర్ లో ఉండి వార్డు సభ్యులను వెంట తీసుకెళ్లి ఛైర్మన్ పదవి విషయంలో విజయం సొంతం చేసుకున్నారు. దీంతో హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ జెండా మరోమారు రెపరెపలాడింది.