NTV Telugu Site icon

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకు ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉంది.. ఏఎస్ఐ సర్వేలో సంచలన విషయాలు..

Gyanvapi

Gyanvapi

Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వసం చేసినట్లు నివేదిక సూచిస్తోందని జైన్ అన్నారు. ‘‘మసీదులో లోపల కనుగొన్న వక్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయి, నిర్మాణానికి నష్టం జరగలేదు, శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా, ఇప్పటికే ఉన్న నిర్మాణంలో గతంలో ఉన్న నిర్మాణానికి సంబంధించిన స్తంభాలను ఉపయోగించారు, ముందుగా ఉన్న నిర్మాణం అక్కడే ఉంది’’ అని ఆయన విలేకరులతో అన్నారు.

Read Also: Flipkart Layoff 2024: 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫ్లిప్ కార్ట్..

స్తంభాల క్రమపద్ధతిలో అధ్యయనం చేశామని, ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని, ముందుగా ఉన్న ఆలయ కేంద్ర నిర్మాణాన్ని ప్రస్తుతం మసీదు హాల్‌గా ఉపయోగిస్తున్నారని, ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు. చెక్కిన శిల్పాలను మళ్లీ ఉపయోగించేందుకు ధ్వంసం చేశారని జైన్ చెప్పారు. ప్రస్తుతం మసీదులో మునుపటి నిర్మాణానికి సంబంధించిన 34 శాసనాలు ఉపయోగించబడ్డాయని, అంటే ఈ మసీదు తయారు చేసేందుకు ఆలయాన్ని ధ్వంసం చేశారన్నారు. శాసనాల్లో జనారదన, రుద్ర, ఉమేశ్వర పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయని జైన్ చెప్పారు. శాసనాల్లో మహా ముక్తి మండపం వంటి పదాలు ఉన్నట్లు వెల్లడించారు.

ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వే చేశారని, సైట్‌లో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లు తెలుస్తోందని, ప్రస్తుత నిర్మానం ముందుగా ఉన్న నిర్మాణంపై నిర్మించబడిందనే విషయాన్ని సూచిస్తోందని అన్నారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలతో రాయబడిన పురాతన హిందూ దేవాలయాని చెందిన శాసనాలను కనుగొన్నట్లు జైన్ పేర్కొన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే రిపోర్టును ఇరు పక్షాలకు ఇవ్వాలని బుధవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ రిపోర్టను బహరంగపరచాలని కోర్టు తెలిపింది.