Site icon NTV Telugu

Hindu Temple Attack: మరో హిందూ ఆలయం ధ్వంసం.. ఏడాదిలో నాలుగో ఘటన!

Hindu Temple Defaced

Hindu Temple Defaced

Hindu Temple Attack: అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఈ వారం ప్రారంభంలో ఇండియానా రాష్ట్రంలోని గ్రీన్‌వుడ్ నగరంలో ఉన్న BAPS స్వామినారాయణ ఆలయం కొందరి దుర్మార్గులకు లక్ష్యంగా మారింది. ఆగస్టు 10న చోటుచేసుకున్న ఈ ఘటనను ఆలయ అధికారిక ప్రజా వ్యవహారాల విభాగం “ద్వేషపూరిత చర్య”గా అభివర్ణించింది. అలాగే చికాగోలోని భారత కాన్సులేట్ ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటనలో ఆలయం ప్రధాన సైన్ బోర్డును అపవిత్రం చేయడం ఖండించదగినది అంటూ తెలిపింది. అలాగే ఆలయ పరిసరాల్లో సమస్యలు సృష్టించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

South Central Railways : తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

కాన్సులేట్ ట్విటర్ లో “గ్రీన్‌వుడ్‌లోని BAPS స్వామినారాయణ్ ఆలయం ప్రధాన సైన్‌బోర్డు అపవిత్రం చేయడం ఖండించదగినది. ఈ విషయంపై చట్టం అమలు చేసే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్య కోరాం అని తెలిపింది. గ్రీన్‌వుడ్ మేయర్ సహా స్థానిక నాయకులు, భక్తులతో కాన్సుల్ జనరల్ సమావేశమై.. అక్కడ ఐక్యత కోసం, దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆలయ పరిపాలన కూడా మరో పోస్ట్‌లో.. ఈ ఘటన మా సమాజం సంకల్పాన్ని బలోపేతం చేసింది. మత వ్యతిరేక ప్రవర్తనకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము అని పేర్కొంది.

Niddhi Agerwal : ఓ వైపు జోరు వానలు.. మరోవైపు నిధి అగర్వాల్ నిధులు..

ఇకపోతే ఒక సంవత్సరం లోపు ఇదే BAPS ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న నాలుగో ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలో జరగబోయే కృష్ణ జన్మాష్టమికి కొన్ని రోజుల ముందు ఇది జరగడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి నెలలో కాలిఫోర్నియాలోని BAPS హిందూ దేవాలయం కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేత అపవిత్రం చేయబడింది. ఆ సమయంలో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ చర్యను “నీచమైనది”గా పేర్కొని, US చట్ట అమలు సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version