Karnataka Shakti Scheme: కర్నాటకలో ఉచిత బస్సు టిక్కెట్టు కోసం బురఖా వేసుకున్న వ్యక్తి.. ఎలా పట్టుకున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Shakti Scheme: బస్ ఛార్జీని ఆదా చేసేందుకు ఓ హిందూ వ్యక్తి బురఖా ధరించిన వింత ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి బురఖా ధరించి బ్యాగ్‌ని కూడా పట్టుకుని వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కర్నాటక ప్రభుత్వం శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందినది. అక్కడ బస్టాప్‌లో ఒక హిందూ వ్యక్తి బురఖా ధరించి కనిపించాడు. ఆ వ్యక్తి పేరు వీరభద్రయ్య మఠపతి. ప్రజలకు అనుమానం రావడంతో ఆయన వద్దకు వెళ్లి విచారించారు. ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకోవడం ప్రారంభించి, ‘నేను అడుక్కునేందుకే ఈ బురఖా వేసుకున్నాను…’ అయితే, అతని సమాధానం వారిని సంతృప్తి పరచలేదు. అంతే కాదు ఆ వ్యక్తి నుంచి ఓ మహిళ ఆధార్ కార్డు ఫొటో కాపీ కూడా లభ్యమైంది.
Read Also:Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
శక్తి యోజన అంటే ఏమిటి?
శక్తి పథకం కింద, కర్ణాటకలోని మహిళలు రాష్ట్రంలో నడిచే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే అమలు చేసిన మొదటి ఐదు ఎన్నికల హామీలలో ఇది ఒకటి. రోజుకు 41.8 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ ఉచిత ప్రయాణ సేవ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.4,051.56 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. శక్తి పథకం కర్నాటక రాష్ట్రంలో నడిచే సాధారణ బస్సు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, అంబారి, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఫ్లై బస్, వాయు వజ్ర, వజ్ర, నాన్-ఏసీ స్లీపర్, రాజహంస, ఈవీ పవర్ ప్లస్ ఏసీ బస్సులను ఈ పథకం కింద మినహాయించిన సంగతి తెలిసిందే.
Read Also:Dark Chocolate: డార్క్ చాక్లేట్ రోజూ తీసుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా?
- Tags
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!