Hindenburg Shutdown: అదానీ గ్రూప్‌ను షేక్ చేస్తున్న అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడుతోంది. సంచలనాత్మక ఆర్థిక పరిశోధనల శకానికి ముగింపు పలికిన కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ బుధవారం ప్రకటించారు. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు తన ప్రయాణం, పోరాటాలు, విజయాల గురించి ఎమోషనల్ X పోస్ట్ ద్వారా తెలిపాడు. మేము పని చేస్తున్న ఆలోచనలను పూర్తి చేసిన తర్వాత దాన్ని మూసివేయాలనేది మా ప్రణాళిక అని, ఆ రోజు ఈ రోజు అని అండర్సన్ నోట్‌లో రాశాడు.
Also Read: DilRuba : ‘దిల్ రూబా’ ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్
A Personal Note From Our Founderhttps://t.co/OOMtimC0gV
— Hindenburg Research (@HindenburgRes) January 15, 2025
2017లో స్థాపించబడినప్పటి నుండి సమాజంలో మోసం, అవినీతి, దుర్వినియోగాన్ని బహిర్గతం చేయడంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఖ్యాతిని పొందింది. మేము కొన్ని సామ్రాజ్యాలను కదిలించాము. వాటిని కదిలించబడాలని మేము ముందే భావించామని ఆండర్సన్ సంస్థ విజయాలను పంచుకున్నారు. వాటిలో అదానీ గ్రూప్ కూడా ఒకటి. హిండెన్‌బర్గ్‌ను ఆర్థిక పరిశోధనలో పవర్‌హౌస్‌గా మార్చడానికి అతని కుటుంబం, స్నేహితులు ఇంకా 11 మంది అంకితభావంతో కూడిన బృందం మద్దతు అని చెప్పుకొచ్చాడు.
Also Read: Vodafone-Idea: చౌక ధరలో న్యూ రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్!
ఇకపోతే, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ.. జనవరి 2023లో 40 ఏళ్ల ఆండర్సన్ ఒక నివేదికను ప్రచురించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆ సమయంలో గౌతమ్ అదానీ ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. ఈ విషయం పై గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక గ్రూప్‌ను అస్థిరపరచడమే కాకుండా రాజకీయంగా భారతదేశాన్ని పరువు తీసేలా ఉందని తెలిపారు.