Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన రనౌట్ ఘటన వైరల్.
- న్యూ ఢిల్లీ టైగర్స్-ఔటర్ ఢిల్లీ వారియర్స్ మ్యాచ్‌లో ఘటన.
- చివరి బంతికి గెలుపుకు ఔటర్ ఢిల్లీ వారియర్స్‌కు 1 పరుగు అవసరం.
- హిమ్మత్ సింగ్ బంతిని అందుకోలేక కోపంతో కాలితో..
- తన్నిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో ప్రథమ్ సలూజా రనౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himmat Singh: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. న్యూ ఢిల్లీ టైగర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి బంతికి జరిగిన ఓ విచిత్రమైన రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రన్ కారణంగా మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లింది. ఫీల్డింగ్‌లో జరిగిన చిన్న పొరపాటు, ఆ తర్వాత నిరాశతో చేసిన ఒక కిక్.. చివరకు అద్భుత రనౌట్.. అబ్బో.. ఇలా ఎన్ని ట్విస్ట్ లో.. మరి ఆ సంఘటనెంటో చూసేద్దామా..
156 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఔటర్ ఢిల్లీ వారియర్స్‌కు చివరి బంతికి గెలుపు కోసం కేవలం ఒక పరుగు మాత్రమే అవసరం. బ్యాటర్ ప్రథమ్ సలూజా బంతిని మిడ్ ఆన్ దిశగా ఆడి వెంటనే పరుగుకు చేశాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హిమ్మత్ సింగ్ బంతిని అందుకోవడానికి ముందుకు వచ్చాడు. అయితే అతను బంతిని సరిగా పట్టుకోలేకపోయాడు. దీంతో నిరాశకు గురైన హిమ్మత్.. కోపంతో బంతిని కాలితో తన్నాడు. అయితే ఆ కిక్ చేసిన బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే అప్పటికి సలూజా క్రీజులోకి చేరకపోవడంతో అతను రనౌట్ అయ్యాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బంతి వికెట్లను తాకిన వెంటనే ఏమి జరిగిందో హిమ్మత్ సింగ్‌కే కొన్ని క్షణాలు అర్థం కాలేదు. అయితే అతని సహచర ఆటగాళ్లు మాత్రం వికెట్ పడటంతో సంబరాలు చేసుకున్నారు. ఈ రనౌట్‌తో ఔటర్ ఢిల్లీ వారియర్స్ 15 ఓవర్లలో 155/9 స్కోరుతో నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూ ఢిల్లీ టైగర్స్ కూడా 156/5 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. చివరి రెండు బంతుల్లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ వరుసగా రెండు రనౌట్లు అయ్యింది. చివరి బంతికి ముందు కెప్టెన్ సిద్ధాంత్ శర్మ కూడా రనౌట్ కావడం మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఔటర్ ఢిల్లీ వారియర్స్ 1 ఓవర్లో 20/1 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 21 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ ఢిల్లీ టైగర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ రెండు బంతుల్లో ఒక సిక్సర్‌తో 6 పరుగులు చేసి శివమ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వెంటనే హృతిక్ షోకీన్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో న్యూ ఢిల్లీ టైగర్స్ 0.3 ఓవర్లలో 6/2 స్కోరుతో ఇన్నింగ్స్ ముగిసింది. దీనితో ఔటర్ ఢిల్లీ వారియర్స్ కు విజయం వరించింది.
What a run out by Himmat Singh 💥
A run out,out of nowhere in Delhi Premier League pic.twitter.com/sqVDV5ieSo— StrangerMan (@_StrangerMan7) August 4, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..