NTV Telugu Site icon

Himachal Floods: వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఏడుగురు.. వీడియో షేర్‌ చేసిన సీఎం

Flood

Flood

హిమాచల్ ప్రదేశ్ ను వానలు వదలడం లేదు. కొన్ని రోజుల ముందు వచ్చిన జలప్రళయం నుంచి కోలుకోక ముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్లీ వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.కొండల్లో నుంచి కొట్టుకు వచ్చిన బురద, మట్టి, రాళ్లతో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

Also Read: Instagram: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్‌.. ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని..!

కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది. వానల కారణంగా నీరు చేరడంతో బియాస్ నది ఉద్ధృతంగా మారింది. తాజాగా మండి జిల్లాలో వరదలు పోటెత్తాయి. దురదృష్టవశాత్తు సంబల్‌ గ్రామంలో వరద ధాటికి ఏడుగురు నీటిలో కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖ్ షేర్ చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన సమయమని ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రావొద్దని ఆయన ప్రజలను కోరారు. ఈ వరద వీడియో చూస్తేంటే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది.

Show comments