Site icon NTV Telugu

Himachal Pradesh Cabinet: నేడు హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ

Himachal Pradesh Cabinet

Himachal Pradesh Cabinet

Himachal Pradesh Cabinet: హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం జరగనుంది. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. 10 మంది వ్యక్తుల జాబితాను పార్టీ హైకమాండ్‌కు సమర్పించామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే రాష్ట్రంలో పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు.

ROBO Lawyer: తొలిసారి కోర్టులో వాదించనున్న రోబో లాయర్

నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పార్టీ హైకమాండ్‌తో భేటీ అనంతరం శనివారం సాయంత్రం సీఎం ఢిల్లీ నుంచి సిమ్లా చేరుకున్నారు. సమావేశాలు వ్యక్తిగతమని, మంత్రివర్గ విస్తరణ కూడా తమ ప్రత్యేకాధికారమని, పది మంది ఎమ్మెల్యేల జాబితాను హైకమాండ్‌కు అందజేశామని.. ఆమోదం రాగానే మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టనున్నామని సీఎం చెప్పారు. తాను ఆదివారం ముంబైని సందర్శిస్తానని సుఖూ తెలిపారు. పుణేలో మరొక షెడ్యూల్ కార్యక్రమం ఉందన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ ఆమోదం లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు.

Exit mobile version