NTV Telugu Site icon

CM Sukhwinder Sukh: జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నా..

Suk

Suk

హిమాచల్‌ ప్రదేశ్‌ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్‌ సుఖు తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయగా.. కేంద్రం స్పందించాల్సి ఉంది. హిమాచల్ లో భారీ వర్షాలతో శిమ్లా సహా పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.

Prabhas Fans: సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ అభిమానుల రచ్చ.. స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం!

మరోవైపు సీఎం సుఖ్వీందర్‌ సుఖు మీడియాతో మాట్లాడుతూ.. సహాయక చర్యలను వేగవంతం చేశామని చెప్పారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కావాల్సిన సాయం అందజేస్తున్నామన్నారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశాయని పేర్కొన్నారు. తక్షణమే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని సుఖు తెలిపారు.

TSRTC: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

హిమాచల్ ప్రదేశ్‌కు భారీ ప్రమాదం పొంచి ఉంది. అక్కడ 17,000 చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. అందులో 1,357 ప్రదేశాలు సిమ్లాలోనే ఉన్నాయని తెలిపింది. వర్షం కురుస్తున్న సమయంలో మట్టి నిరంతరం ఉబ్బిపోతుండడం వల్ల రోడ్డు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి విపత్తు నిర్వహణ సామర్థ్యం, హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్కడి నుంచి ప్రజలను తరలించే పని జరిగినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో పెను ప్రమాదం పొంచి ఉంది.

Aadhaar Card: ఆధార్‌ అప్‌డేట్‌పై యూఐడీఏఐ వార్నింగ్‌.. ఇలా చేస్తే అంతే..!

ఇటీవల, సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో ప్రమాదకరమైన కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ భవనంపై చెట్టు పడటంతో.. ఆ భవనం కుప్పకూలింది. అదేవిధంగా సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. శిథిలాల నుంచి పలువురి మృతదేహాలను బయటకు తీయగా.. ఇంకా మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Rahul Gandhi: కూరగాయల వ్యాపారికి భోజనం వడ్డించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,301 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండటంతో 506 రహదారుల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాంగ్రా జిల్లాలో వరదలు సంభవించిన నేపథ్యంలో గత మూడు రోజుల్లోనే 2,074 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.