Site icon NTV Telugu

Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

Viral Catch

Viral Catch

Wicket Keeper Catch: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ కూడా ఎంతో కీలకం. ఫీల్డింగ్ లో ఒక్క తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. అయితే, ఈ క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్ల నుంచి అనుకోకుండా నవ్వులు పుట్టించే ఘట్టాలు కూడా చోటుచేసుకుంటాయి. అలాంటి ఒక సరదా సంఘటన తాజాగా కేరళ ప్రీమియర్ లీగ్ (Kerala Premier League)లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తుంది.

Read Also: Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో KPA 12, KCSA Calicut జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బౌలర్ వేసిన బంతి బాట్స్‌మెన్‌ను ఔట్ చేసేలా లెగ్ సైడ్‌కు స్వింగ్ అయింది. అలా వేసిన బాల్ ను బాట్స్‌మన్ బ్యాట్ తాకి బంతి వికెట్ కీపర్ వైపు వెళ్ళింది. దానితో అటుగా వెళ్తున్న వికెట్ కీపర్ బంతిని పట్టేందుకు వైపు డైవ్ చేసాడు. కానీ బంతిని అందుకునే క్రమంలో అతని గ్లవ్స్‌ నుండి జారిపోతూ గాల్లోకి ఎగిరి.. చివరికి తన వీపుపై పడింది. అలా పడిన బంతిని కింద పడకుండా నడుముపై బ్యాలెన్స్ చేసాడు.

Read Also: iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

ఈ తతంగాన్ని చూసిన జట్టు సభ్యులు ఒక్కసారిగా అతని దెగ్గరికి పరుగెత్తుతూ వచ్చి ఆ బంతిని పట్టుకుంటారు. దీనితో వికెట్ కీపర్‌ను అభినందిస్తూ టీం మేట్స్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఇలా క్యాచ్ పడితే అవుట్ ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఫన్నీ ఎమోజిలతో వారి స్పందనను తెలుపుతున్నారు. ఇంకెందుకు ఆలశ్యం ఈ వైరల్ క్యాచ్ ను మీరు కూడా ఆస్వాదించండి.

Exit mobile version