NTV Telugu Site icon

Shocking Video: వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా రైల్వే టీసీపై తెగిపడిన కరెంట్ వైర్

Kharagpur

Kharagpur

Shocking Video: ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్లాట్ ఫాంపై నిలుచున్న రైల్వే టీసీపై ఉన్నట్టుండి కరెంట్ వైరు తెగిపడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే లైన్ కోసం హై ఓల్టేజ్‌ కరెంట్ తీగలు వాడుతారు. ఆ తీగలను తాకితేనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్‌ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది.

Read Also : Massive Fire in Shopping Mall: షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్నికీలలు

ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ ఫారమ్‌పై టికెట్‌ కలెక్టర్‌(టీసీ) వేరే వ్యక్తితో మాట్లాడుతూ నిలబడ్డారు. ఒక్కసారిగా హైఓల్టేజ్‌ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే, బాధితుడు సుజన్‌ సింఘ్‌ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు.