Site icon NTV Telugu

హుజురాబాద్ బైపోల్ : కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు..!

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ఉదయం 7 గంటల కు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే… ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన ఈ ఉప ఎన్నికలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజురాబాద్‌ వీణవంక మండలం కోర్కల్‌ గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కోర్కల్‌ లో పోలింగ్‌ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు కూడా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలింగ్‌ కేంద్రం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు పరుగులు తీశారు. అయితే.. పోలింగ్‌ కేంద్రం వద్ద 100 మీటర్ల లోపు కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తుండడంతోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version