ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా ఈ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తీర్పు రిజర్వ్ చేసింది. నేడు జనసేన గాజు గుర్తుపై తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అయితే, ఈసీ ఇప్పటికే గాజు గ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో పెట్టడం గమనార్హం. గాజు గ్లాసు గుర్తు తమకే వస్తుందని జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మంగళవారం దీనిపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.