Site icon NTV Telugu

Narayana: నారాయణ కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు

High Court

High Court

మాజీ మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి ఉద్యోగి ప్రమీలను ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరికొందరి పై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన తమ ముందు హాజరు కావాలని మాజీ మంత్రి నారాయణ , ఆయన సతీమణి రమాదేవి , కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ నోటీసులపై కోర్టుని ఆశ్రయించారు. నారాయణ తరపున వాదనలు వినిపించారు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్.

Read Also:Olivia Morris: మా జెన్నీ పాపకు కూడా ఒక అవార్డు ఇస్తే.. సంతోషిస్తాం

మహిళలను ఇంటి వద్దనే విచారించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని పేర్కొన్న దమ్మాలపాటి. నారాయణను ఇంటి వద్దే విచారించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేసిన శ్రీనివాస్. వాదనలు పరిగణలోకి తీసుకొని పిటిషనర్లను ఇంటి వద్దనే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Read Also: Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్‌లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!

Exit mobile version