Site icon NTV Telugu

High Court: గ్రూప్‌-1 పిటిషనర్లకు జరిమానా విధించిన హైకోర్టు..

High Court

High Court

గ్రూప్‌1 పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. ఆయన పిటిషనర్లకు 20వేల జరిమానా విధించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19మంది అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్‌సైట్‌లో ఉన్న మార్కులకు తేడాలున్నాయన్న పిటిషనర్లు పేర్కొన్నారు.

READ MORE: Prayagraj: ఏసీ కోచ్ నుండి దిగి ప్లాట్‌ఫారమ్ పై కుర్చున్న దొంగలు.. చెమటలు పట్టడంతో అసలు విషయం బట్టబయలు!

రీవాల్యుయేషన్‌ చేపట్టి మార్కులను టీజీపీఎస్సీ పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. అభ్యర్థులు తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఇరువైపులా వాదనలు విన్నది. ప్రాథమిక వివరాలను పరిశీలిస్తే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని స్పష్టమైంది. వాస్తవాలను దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని హైకోర్టు పిటిషనర్లపై మండిపడింది. వారిపై చర్యలు తీసుకోవాలని జ్యూడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

READ MORE: KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కు గాయం.. బెడ్ రెస్ట్ సూచించిన వైద్యులు

Exit mobile version