NTV Telugu Site icon

Postal Ballot: వైసీపీ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు… సుప్రీంకు వెళ్లే యోచన..

Ap High Court

Ap High Court

Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై శుక్రవారం వాదనలు ముగించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసిన చేసిన విషయం విదితమే.. శనివారం రోజు సాయత్రం 6 గంటలకు తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించగా.. ఈ రోజు తీర్పు ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా.. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఇదే సమయంలో.. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉందని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన వివరణను సమర్థించింది ఏపీ హైకోర్టు. వైసీపీ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పిటిషన్ విచారణ అర్హత లేదని పేర్కొంది న్యాయస్థానం.. ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ వైసీపీకి చెప్పింది హైకోర్టు.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాం అన్నారు.. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ తాను చేసిన నిబంధనలను కాదని ఎలా ఉత్తర్వులు ఇస్తారు..? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read Also: Bhatti Vikramarka: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి.. విద్యుత్ సిబ్బందికి డిప్యూటీ సీఎం ఆదేశాలు

Show comments