NTV Telugu Site icon

AP CM Chandrababu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌.. అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది..

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. రాజ‌ధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల త‌ర‌హాలో అంతర్జాతీయ ప్రమాణాల‌తో కూడిన అత్యుత్తమ ఇనిస్టిట్యూట్‌ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసే ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

 

Show comments