NTV Telugu Site icon

AP Highcourt: ఇసుక ధర పసిడితో పోటీ పడుతోందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..!

Andhra Pradesh High Court

Andhra Pradesh High Court

సామాన్యులకు ఇసుక ధర భారీగా పెరగడం కారణంగా అందుబాటులో ఉండట్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి మైనింగ్‌ అనుమతులు తీసుకున్న సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. కేవలం 5 ఎకరాల్లో అనుమతులు తీసుకొన్నవారు., ఏకంగా 50 ఎకరాల్లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని తెలిపింది.

Also read: Murder: ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన తండ్రికొడుకులు..!

అసలు ఇసుక రీచ్‌ల్లో ఏం జరుగుతుందో అధికారులకు ఏమి తెలియడం లేదని హైకోర్టు పేర్కొంది. ఇసుక తరలింపు, తవ్వకంపై మైనింగ్‌ అధికారులు పూర్తిగా నియంత్రణ కోల్పోయారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సామాన్య ప్రజలకు ఇసుక ధర అందుబాటులో ఉండేందుకు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అంటూ హైకోర్టు పేర్కొంది.

Also read: Head Phones: రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్‌ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..

ఇకపోతే అసలు ఇసుక ధరను ఏవిధంగా నిర్ణయిస్తున్నారని, అలాగే ఇసుక ధరను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నలు సంధించింది కోర్టు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద సరైన యంత్రాంగం లేదని ఇందు మూలంగా పేర్కొంది. ఇది వరకు లారీ ఇసుక రూ. 5 వేలను కాస్త ఇప్పుడు రూ. 20 నుంచి 30 వేల రూపాయలకు అమ్ముతుండడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా ఇసుక అధిక ధరల నుంచి సామాన్యులను ఎలా కాపాడుతారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.