High Alert In Hyderabad: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్‌తో ఉపయోగించిన చర్యగా అనుమానిస్తున్నారు. ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర జరిగిన ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమవగా, పేలుడు వల్ల ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఎనిమిది మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. బాధితులకు LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు.
Airtel Prepaid Plan: యూజర్లకు షాక్.. ఆ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసిన ఎయిర్‌టెల్
ఢిల్లీలో పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఘటనాస్థలికి NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించాయి.
Delhi Car Blast Live Updates : పేలుడులో 8కి చేరిన మృతుల సంఖ్య.. రంగంలోకి NIA, NSG
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో పోలీసులు భద్రతను పెంచారు. నగరంలో ‘నాకా బందీ’ (అన్ని వైపులా దిగ్బంధనం) ఏర్పాటు చేసి రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు.
