NTV Telugu Site icon

High Alert: శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్

Airport

Airport

ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్బంగా.. విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వారిని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా.. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులకు ఎంట్రీ లేదని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, వారితో వెళ్లేవారికి అధికారులు కొన్ని సూచనలు చేశారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకూ బలగాలు రద్దు చేశాయి.

Khushi Trailer: భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా

మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టులోని పార్కింగ్, డిపార్చర్, అరైవెల్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాలకు వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు తెలపడానికి ఒకరు లేదా ఇద్దరు రావాలని అధికారులు సూచిస్తున్నారు. తప్ప అధిక సంఖ్యలో వస్తే అనుమతించబోమని అధికారులు అంటున్నారు. ప్రయాణికులు, వాహనదారులు అందరు గమనించి సహకరించాలని అధికారులు కోరారు.