Site icon NTV Telugu

Insulin Resistance: షుగర్ టెస్ట్ నార్మల్.. అయినా అలసట! “హిడెన్ డయాబెటిస్” కావచ్చు.. జాగ్రత్త సుమీ!

Insulin Resistance

Insulin Resistance

Insulin Resistance: ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది ఇబ్బడి పెడుతున్న వ్యాధుల్లో షుగర్ (చెక్కర వ్యాధి) ప్రముఖంగా వినిపిస్తుంది. దీని ప్రభావం భారత్ లో మరింత వేగంగా పెరుగుతుంది. అయితే కొంతమందికి షుగర్ టెస్ట్‌లో ఫలితాలు సాధారణంగా వచ్చినప్పటికీ.. చాలా వరకు అలసటగా అనిపిస్తుంది. అయితే దీనిని చిన్న సమస్యగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో దాగి ఉండే “హిడెన్ డయాబెటిస్” లేదా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్‌’కు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sperm Count Warning: ఇలాంటి పనులు చేస్తున్నారా! అయితే మీ మగతనం డేంజర్లో పడినట్లే!

వైద్య నిపుణుల వివరాల ప్రకారం.. కొందరికి బ్లడ్ షుగర్ రిపోర్ట్ సాధారణంగా కనిపించినా శరీరంలో ఇన్సులిన్ సరైన విధంగా పనిచేయకపోవచ్చు. ఈ పరిస్థితిని ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ అంటారు. ఇందులో గ్లూకోజ్‌ ను శరీర కణాలు సరిగా ఉపయోగించలేకపోవడంతో అలసటతో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

షుగర్ నార్మల్ గా ఉన్నా కనిపించే లక్షణాలు:
* ఎప్పుడూ అలసటగా ఉండటం.
* భోజనం చేసిన తర్వాత ఎక్కువ నిద్ర రావడం.
* పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం.
* తరచుగా తీపి తినాలనిపించడం.
* కళ్లకు స్వల్పంగా మసకగా కనిపించడం.
* ముఖ్యంగా మెడ వెనుక భాగం, గాల్లపై చర్మం నల్లబడటం.

Har Ghar Lakhpati Scheme: ఎస్బీఐ అద్భుతమైన స్కీమ్.. ప్రతి నెలా చిన్న సేవింగ్స్ తో చేతికి రూ. 10 లక్షలు..!

ఎందుకు ఇలా?
చాలామంది కేవలం ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ మాత్రమే చేయించుకుంటారు. కానీ HbA1c పరీక్ష చేయించుకోరు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు HbA1c స్థాయి 6.6 కంటే ఎక్కువగా ఉంటే అది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్‌’కు సంకేతం. ఈ పరిస్థితిని ముందుగానే నియంత్రించకపోతే తరువాత డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంటుంది.

మరీ ఏమి చేయాలి?
* ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి.
* చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.
* ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
* ఫాస్ట్ ఫుడ్‌ను వీలైనంత వరకు నివారించాలి.

Exit mobile version