Site icon NTV Telugu

Hi Nanna : ఆడియో హక్కులు పొందిన ఆ బాలీవుడ్ దిగ్గజ సంస్థ..

Whatsapp Image 2023 07 16 At 4.07.04 Pm

Whatsapp Image 2023 07 16 At 4.07.04 Pm

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”హాయ్ నాన్న’. డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో  అలరించ బోతున్నాడు.ఈ మధ్య నాని వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయగా అద్భుత విజయం సాధించింది. దసరా సినిమా తరువాత నాని తన కెరీర్ లో 30 వ సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమానే హాయ్ నాన్న.ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ టైటిల్ మరియు టీజర్ గ్లింప్స్ ను విడుదల చేసారు. ఈ గ్లింప్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

ఈ సినిమా ను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తున్నారు.మృణాల్ ఠాకూర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా లో శృతి హాసన్ ఒక ముఖ్య పాత్ర లో నటిస్తుంది.ఈ సినిమాను వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి… ”హాయ్ నాన్న” అనే క్యాచీ టైటిల్ కు గ్లింప్స్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ఆడియో హక్కుల గురించి ఒక వార్త బాగా వైరల్ అయ్యింది.ఈ సినిమా ఆడియో హక్కుల డీల్ పూర్తి అయినట్టు సమాచారం..ఈ సినిమా ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ వారు సొంతం చేసుకున్నారు.భారీ ధరకు హాయ్ నాన్న ఆడియో హక్కుల ను ఈ బాలీవుడ్ దిగ్గజ సంస్థ దక్కించు కున్నట్టు ప్రకటించారు.. ఈ సినిమా ఎంతో ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

Exit mobile version