Hi Nanna : భారీ ధరకు సేల్ అయిన హాయ్ నాన్న ఓటీటీ రైట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘హాయ్ నాన్న’.వైరా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చే నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్‌గా పరిచయం చేసారు.హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేస్తోంది.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గెస్ట్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇక ఈ సినిమాలో నానికి కూతురుగా బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. వీరితోపాటు జయరామ్ మరియు ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ వంటి ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో హాయ్ నాన్న సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేంజ్లో అమ్ముడు పోయినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని భాషల్లో కలిపి హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ రూ. 37 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ గురించి మాత్రం పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.అలాగే, హాయ్ నాన్న హిందీ డబ్బింగ్ అండ్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ. 7.5 కోట్లు దక్కినట్లు సమాచారం. ఇలా రిలీజ్‌కు ముందే హాయ్ నాన్న మూవీ తో నిర్వాతకు భారీ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమా విడుదల తర్వాత మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ ఏడాది దసరా సినిమాతో నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో హాయ్ నాన్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!