టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాయ్ నాన్న సినిమా నాని సినీ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.కాగా నాని టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నాని, మృణాళ్ ఠాకూర్ చిట్ చాట్ సెషన్స్‌లో పాల్గొంటూ.. సినిమా పై సూపర్ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. హాయ్.. కొత్త ఎనర్జీ తో నవంబర్‌లో అడుగుపెడుతున్నాం.. ప్రేమ ఊపందుకుంటున్నది.. ఇక్కడి నుండి హాయ్ నాన్న కోసం మాత్రమేనంటూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికే హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో మరియు సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతూ సినిమా పై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్య లో వ్యూస్ రాబడుతూ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి , డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది దసరా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాని… దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో నాని హాయ్ నాన్న మూవీకి కూడా మంచి బిజినెస్ జరిగింది..