Hi Nanna : హాయ్ నాన్న మూవీ టీం కు షాక్.. ఆన్లైన్ లో హెచ్‌డీ క్వాలిటీ మూవీ లీక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హాయ్ నాన్న మూవీ గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన తొలి రోజే ఆన్‌లైన్ లో లీకైంది.అది కూడా హెచ్‌డీ క్వాలిటీలో కావడం గమనార్హం. పైరసీని అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలా తొలి రోజే సినిమాలు లీకవడం చిత్ర యూనిట్ ను ఆందోళన కలిగిస్తుంది.డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్ట్ చేసిన హాయ్ నాన్న మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దసరా మూవీ లో మాస్ లుక్ లో కనిపించి బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ఈసారి ఈ హాయ్ నాన్న మూవీ లో క్లాస్ లుక్ లో కనిపించి తనదైన యాక్టింగ్ తో అదరగొట్టాడు.హాయ్ నాన్న మూవీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.
ఈ సినిమాలో నాని కూతురి కోసం ఆరాటపడే తండ్రిగా,ప్రేమికుడిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. అలాగే వర్ష మరియు యశ్న అనే రెండు షేడ్స్‌తో సాగే పాత్రలో మృణాల్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సీతారామం తర్వాత మరోసారి తన యాక్టింగ్‌తో ఎంతగానో మెప్పించింది. శృతిహాసన్ ఓ పాటలో మాత్రమే కనిపిస్తుంది. బేబీ కియారా నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఈ సినిమాకు హీషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ పెద్ద హైలైట్ గా నిలిచింది. ఓవర్ ఆల్ గా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుతుంది.ఓ వైపు సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చిన ఆనందంలో మేకర్స్ ఉండగా.. మరోవైపు ఈ మూవీని ఆన్‌లైన్లో లీక్ చేశారు. హెచ్‌డీ క్వాలిటీలో ఈ మూవీని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునేలా కొన్ని పైరసీ వెబ్ సైట్లు లింకులు కూడా పెట్టాయి.ఎన్నో సైట్లు హాయ్ నాన్న పైరసీ కాపీలను తమ వెబ్‌సైట్లలో పెట్టాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు పైరసీ బారిన పడగా.. తాజాగా నాని మూవీకి కూడా ఆ పైరసి బెడద తప్పలేదు.ఈ పైరసీ సైట్లపై గతంలో చర్యలు తీసుకున్నారు. అయినా కూడా ఈ లీకులు మాత్రం ఆగడం లేదు.
Also Read
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!