ఇక తమ నిరీక్షణకు తెరపడే సమయం రానే వచ్చేసిందని సంబరపడిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఏది ఏమైనా జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అవుద్దని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా లాంఛనమే అని తెలుస్తోంది. మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వీరమల్లు వాయిదాను కన్ఫామ్ చేశారు. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవడానికి బిజినెస్ అవలేదంటూ ఏదేదో ప్రచారం జరగుతోంది. అయితే విఎఫ్‌ఎక్స్ వర్క్ డిలే కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా తెలిసింది.
హరిహర వీరమల్లు ట్రైలర్‌ను సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ధనుష్ నటించిన ‘కుబేర’ సినిమాతో వీరమల్లు ట్రైలర్ ఎటాచ్ చేయనున్నారట. ఈ లెక్కన జూలై 4 లేదా 11న హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సినిమా వాయిదా పడిన నేపథ్యంలో.. ఈ నెల 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామా క్రీడా మైదానంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా వేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా హరిహర వీరమల్లు పోస్ట్‌పోన్ అయినట్టే. కాకపోతే.. మేకర్స్ నుంచి కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Nara Lokesh: విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు.. ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు!
అయితే హరిహర వీరమల్లు విషయంలో ఇది కొత్త కాదు. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి కూడా అదే జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ వల్ల డిలే అవుతూ వచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా.. విఎఫ్‌ఎక్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదని అంటున్నారు. మరి ఐదేళ్ల నుంచి మేకర్స్ ఏం చేశారనేదే? ఇక్కడ అంతుబట్టకుండా ఉంది.
