హీరోయిన్ మాధవి లత పేరు వినే ఉంటారు.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ వివాదాలను కోరి మరీ తెచ్చుకుంటుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. మాధవీ లత పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మాధవీలత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతుంటుంది. అప్పుడప్పుడు వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది.
తాజాగా నెటిజన్లు కొంత మంది పెళ్లి గురించి అడగ్గా కోపంతో రగిలి పోయింది..ఈ విషయంపై తాజాగా స్పందించిన ఈ అమ్మడు హాట్ వ్యాఖ్యలు చేసింది.. ప్రియమైన సమాజం. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం అని స్పష్టం చేశారు.. తన దృష్టిలో పెళ్లి అంటే ఇది అని కామెంట్స్ చేసింది.. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..
అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి దారుణంగా మాట్లాడింది..వన్ ఇండస్ట్రీ నా.. బొక్కేం కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ని చూడరు.. నిజమైన టాలెంట్ కి స్కోప్ లేదు.. అందుకే చాలా మంది హీరోయిన్లు తమిళ్ కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్లు అవుతున్నారని చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..