Site icon NTV Telugu

Andrea : ఆ సినిమాలో బట్టల్లేకుండా నటించాను.. సంచలన విషయం చెప్పిన ఆండ్రియా

Andrea Jeremiah

Andrea Jeremiah

Andrea : తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టింది హాట్ బ్యూటీ ఆండ్రీయా. ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే మల్టీ టాలెంటెడ్. చిన్నప్పటి నుంచి తనకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కవ. అంతేకాకుండా ఆండ్రియా మంచి పియానో ప్లేయర్ కూడా. ఆండ్రియా ఓ లాయర్ కూడా అని చాలామందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీకి ఆండ్రియా ఓ సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ రంగంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. అనంతరం ఆండ్రియా కాలివుడ్లో పచ్చైకిళి ముత్తుచ్ఛారం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. కుర్రకారు మొదటి సినిమాలో అమ్మడి అందానికి ముగ్ధులైపోయారు. దీంతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మంగత్త, విశ్వరూపం, తడాఖా, మాస్టర్, వడ చెన్నై లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

Read Also:Sai Dharam Tej: రామ్ చరణ్ లాంచ్ చేసిన ‘సోల్ ఆఫ్ సత్య’

తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో నటించి బహుభాషా నటిగా స్టార్ స్టేటస్ అందుకుంది ఆండ్రియా. వయసు 36 ఏళ్లయినా ఇంకా పెళ్లి మాటే ఎత్తడం లేదు ఈ హాట్ బ్యూటీ. ఇప్పటికీ మంచి యాక్టర్‌గా, సింగర్ గా బిజీగా కెరీర్ నడుపుతోంది. ఆండ్రియా ఇటీవల పుష్ప సినిమా తమిళ్ వెర్షన్లో ఊ అంటావా మామ పాటను పాడి ఆ పాటను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రస్తుతం అమ్మడు వ్యక్తిగత ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ఈమె ఇటీవల డైరక్టర్ వెట్రిమారన్ నిర్మించిన అనల్ మేల్ పణితులి సినిమాలో నగ్నంగా నటించి ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాను నిజంగానే సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో నటించేటప్పుడు నిజంగా సిగ్గుపడ్డట్లు చెప్పుకొచ్చింది. అయితే నిజ జీవితంలో తాను అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నల్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రియా పిశాచి 2, మాలిగై, నో ఎంట్రీ, బాబీ లాంటి ఆరు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్‌ సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది.

Read Also:Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్న సంయుక్త.. ఆ హీరోతో సినిమాలో ఛాన్స్..

Exit mobile version