NTV Telugu Site icon

Game Changer: గేమ్ చేంజర్లో అలాంటి పాత్ర.. అంజలి లీక్ చేసేసిందిగా..!

Game Changer

Game Changer

తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి ప్రస్తుతానికి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యలో ” గీతాంజలి మళ్లీ వచ్చింది ” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఈ 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె ‘గేమ్ చేంజెర్’ సినిమా గురించి స్పందించింది. గేమ్ చేంజర్ సినిమా గురించి ఆమె ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని కామెంట్ చేస్తూనే.. కొన్ని విషయాలను మాత్రం కన్ఫామ్ చేసింది.

Anjali Marriage: తన పెళ్లి పుకార్ల పై స్పందించిన హీరోయిన్ అంజలి..

అదేమిటంటే., తనది గేమ్ చేంజెర్ సినిమాలో ఎలాంటి కీలక పాత్ర కాదని., కేవలం ఒక హీరోయిన్ పాత్ర మాత్రమే అని చెప్పుకొచ్చింది. తనకు ఫ్లాష్ బ్యాక్ లోని ఎక్కువ కదా ఉంటుందని., ఒక అద్భుతమైన సాంగ్ కూడా తన మీద కంపోజ్ చేశారని ఆమె వెల్లడించింది. ఇక సినిమా గురించి తన కంటే దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు గాని వెల్లడిస్తేనే కరెక్ట్ గా ఉంటుందని తెలిపింది. తమకు సినిమా గురించి బయట మాట్లాడవద్దని సూచనలు ఉన్నాయని అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇప్పటి వరకు ఆల్రెడీ హీరోయిన్గా మంచి మార్కులు సాధించిన అంజలి మున్ముందు మంచి క్యారెక్టర్ ఉన్న రోల్స్ చేసే అవకాశం లేకపోలేదు.