Site icon NTV Telugu

Raj Gopal Nayar : పాత్ర కోసం 53 కిలోల బరువు తగ్గిన హీరో.. ప్రాణాలకే ప్రమాదం

Rajgopal

Rajgopal

Raj Gopal Nayar : సాధారణంగా సినిమాల్లో పాత్రల కోసం హీరోలు లుక్ ను మార్చేసుకుంటారు. కొన్ని సార్లు 5 నుంచి పది కిలోల వరకు బరువు పెరగడం లేదా తగ్గడం లాంటిది చేస్తుంటారు. ఇంకొందరు అయితే 18 కిలోల వరకు కూడా తగ్గి అద్భుతమైన పాత్రలు చేశారు. అంతకు మించి ప్రపంచంలోనే ఎవర బరువు తగ్గలేదు. అయితే ఇప్పుడు మరాఠీ హీరో మాత్రం ఏకంగా 53 కిలోల వరకు బరువు తగ్గి అస్థిపంజరంలా తయారైపోయాడు. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా.. అతను ఈ సాహసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది.

Read Also : S. Jaishankar: పాక్ అలా చేస్తే.. భారత సైన్యం ఊరుకోదు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
మరాఠీ ఇండస్ట్రీకి చెందిన పద్మరాజ్ రాజ్ గోపాల్ నాయర్ తన సొంత డైరెక్షన్ లో మాఝి ప్రార్థన అనే సినిమాలో హీరోగా చేశారు. ఈ మూవీకి డైరెక్టర్, హీరో ఆయనే కావడంతో తన పాత్ర కోసం ఏకంగా 53 కిలోల వరకు బరువు తగ్గిపోయాడు. ఈ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. పాత్ర కోసం ప్రాణాలకు తెగించడం ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా మీద ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ మూవీ రేపు విడుదల కాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
Read Also :Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం బడా నిర్మాణ సంస్థల పోటీ..

Exit mobile version