NTV Telugu Site icon

Hero Vishal: 2026 ఎన్నికలే టార్గెట్గా రాజకీయాల్లోకి స్టార్ హీరో విశాల్..!

7

7

తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ తాజాగా సంచలన విషయాన్ని తెలిపారు. అతి త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయన స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ సంబంధించి విశాల్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.

Also read: Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్‌ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”..

ఇందులో భాగంగానే తాను 2026లో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని.. అతి త్వరలోనే తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటూ తెలిపారు. పొలిటికల్ ఎంట్రీలో భాగంగా తాను కూడా ఓ పార్టీని స్థాపిస్తామని తెలియజేశారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ చెన్నై వేదికన ఈ విషయాలను తెలిపాడు. రాష్ట్రంలోని ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని.. వారికోసం తాను అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతోనే ఇలా రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.

Also read:KA Paul: సీఎం జగన్ పై దాడి జరిగిందో.. జరిపించుకున్నారో ఎవరికి తెలుసు..!

ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఒకవేళ మీరు ఏ పార్టీతోనైనా పొత్తు ఏర్పాటు చేసుకుంటారా అని అడగగా.. దానికి విశాల్ సమాధానం ఇస్తూ., మొదటిగా తనని తాను నిరూపించుకున్న తర్వాతనే పోత్తు గురించి, మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తాను అంటూ తెలిపాడు. ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచనలు ఏమీ లేనట్లుగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయన అంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితమే హీరో విజయ్ కూడా సొంత పార్టీ ఏర్పాటు చేసి 2026 ఎన్నికలకు బరిలో దిగడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. చూడాలి మరి తమిళనాడులో సినీ ప్రముఖులు ఇలా రాజకీయాల్లోకి రావడంతో చివరకు ఏ పార్టీ గెలుస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నారు.