Site icon NTV Telugu

VIRAAJI: ‘విరాజి’గా వచ్చేస్తున్న వరుణ్ సందేశ్.. ట్రైలర్‭ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల..

Viraaji Movie Trailer Varun Sandesh

Viraaji Movie Trailer Varun Sandesh

VIRAAJI Movie Trailer Varun Sandesh: M3, మహా మూవీస్ మీడియా పతాకంపై ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం “విరాజి”. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక నేడు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా.. అతడు నటించిన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘విరాజి’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. హీరో వరుణ్ సందేశ్ నా మొదటి సినిమా కొత్త బంగారు లోకంలో హీరోగా నటించిన సనించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విరాజి సినిమా ట్రైలర్ చూసానని., సినిమా ట్రైలర్ చాలా బాగుందని తెలిపారు. ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని, సినిమాలోని విజువల్స్ చాలా కొత్తగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Kanvar Travel: నేమ్ ప్లేట్‌ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..విచారణ ఎప్పుడంటే..?

అలాగే సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయని, సినిమా చూడడానికి రిచ్ గా ఉందని చెప్పుకొచ్చారు. ఇక వరుణ్ సందేశ్ గెటప్, సినిమా టైటిల్, కథ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా వరుణ్ సందేశ్ కి మంచి హిట్ పక్కా అనిపిస్తుందని., నిర్మాత మహేంద్రనాథ్ కూండ్లకు నా అభినందనలని తెలిపారు. అలాగే వరుణ్ సందేశ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమా ఆగస్టు 2న విడుదల అవుతుందని, సినిమాను చూసి సూపర్ హిట్ చేయాలని కోరారు.

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ భలే డేట్ పట్టాడే..

ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరాలు ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. డిఓపి గా జి.వి. అజయ్ కుమార్, సంగీతాన్ని ఎబినేజర్ పాల్ (ఎబ్బి), ఎడిటర్ గా రామ్ తూము, కాస్ట్యూమ్ డిజైనర్ గా రోజా భాస్కర్, మేకప్ చీఫ్ గా భానుప్రియ అడ్డగిరి, ప్రాజెక్ట్ హెడ్ గా సుకుమార్ కిన్నెర, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా మల్లికార్జున్ కిన్నెర, ప్రొడక్షన్ మేనేజర్ గా శ్రావణ్ కుమార్ వందనపు, పిఆర్ఓగా పవన్ పాల్, వి ఎఫ్ ఎక్స్ ను అఖిల్, పోస్టర్ డిజైన్స్ గా జి.దినేష్, గణేష్ రత్నంలు, స్టిల్స్ ను మోహన్, అవుట్ డోర్ పబ్లిసిటీ ని రత్నకుమార్ శీలం, డిజిటల్ పిఆర్ గా ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్, ఆడియో ఆన్ శబరి మ్యూజిక్ గా పనిచేయనున్నారు.

Exit mobile version