Bail For Raj Tarun: నేడు (ఆగష్టు 8 ) నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇకపోతే., 30 సినిమాలకు పైగా రాజ్ తరుణ్ నటించాడని.. రాజ్ తరుణ్ తరుపు న్యాయవాది పేర్కొన్నాడు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరుపు న్యాయవాది కోర్టుకు వివరించడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
Paris Olympics 2024: సెమీస్‌కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..
గత కొద్ది రోజుల నుంచి రాజ్ తరుణ్ – లావణ్య సంబంధించిన విషయాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ కొన్ని రోజులపాటు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతం లోకి వెళ్లాడు. తర్వాత కేసు నిమిత్తం పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ హాజరుకావాలని తెలిపిన అతడు రాలేకపోయాడు. ఇక తాజాగా విడుదలైన సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో ఆయన కనిపించి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నార్సింగ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసింది.