Site icon NTV Telugu

Hero Raj Tarun : లావణ్య అసలు రూపం ఇదే

Raj Tarun

Raj Tarun

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ తనను నమ్మించి మోసం చేసాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాజ్‌తరుణ్ ఓ హీరోయిన్‌తో అక్రమ సంభందం పెట్టుకొని తనను దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, కానీ ఇప్పుడు పెళ్లిచేసుమని కోరినందుకు నన్ను చంపుతనని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు రాజ్‌తరుణ్ అంటే ప్రాణం, కానీ తనను పెళ్లి చేసుకోమన్నందుకు తప్పించుకు తిరుగుతున్నాడు అని లావణ్య మీడియాకు వెల్లడించింది.

కాగా లావణ్య వ్యాఖ్యలపై హీరో రాజ్‌తరుణ్ మీడియాతో మాట్లాడుతూ “లావణ్య చెప్పేది పచ్చి అబద్ధాలు, పరిశ్రమకు వచ్చిన రోజుల్లో ఆమె తనకు సహాయం చేసిన మాట వాస్తవం, నేను గతంలో ఆమెతో రిలేషన్ లో ఉన్నాను. కానీ తనకు లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంలేదు . ఆమెతో నాకు ఎటువంటి శారీరక సంబంధంలేదు, లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంటూ తరచూ డ్రగ్స్ తీసుకుంటుంది, డ్రగ్స్ తీసుకోవద్దని వారించినందుకు తనతో నిత్యం గొడవపడుతుండేది, లావణ్య ప్రవర్తన నచ్చకే నేను ఆమెకు దూరంగా ఉంటున్నా”అని తెలిపారు. గతంలో ఆమెపై పలు బ్లాక్ మెయిల్ కేసులు కూడా ఉన్నాయని రాజ్‌తరుణ్ అన్నారు. కొన్నేళ్లుగా తనను బెదిరిస్తుందని కేవలం నన్ను సమాజంలో అగౌరవ పరచాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తోందని వివరణ ఇచ్చారు. కొన్ని నెలలుగా లావణ్యతో టచ్ లో లేను, నా చిత్ర దర్శకులకు నిర్మాతలకు కాల్స్ చేసి బెదిరిస్తుండంతో ఇక భరించలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు.

ఈ వ్యవహారంలో హీరోయిన్ మాన్వి మల్హోత్రాపై లావణ్య లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నట్టు రాజ్‌తరుణ్ వాపోయాడు. తనపై వచ్చిన ఆరోపణలపై తాను లీగల్‌గా ముందుకు వెళతానని తెలిపాడు. నేను ఎక్కడికి పారిపోను, తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరం తనకు లేదు, అలా ఎప్పుడు చేయను, అన్ని ఆధారాలు సేకరించి లావణ్యపై కేసు ఫైల్ చేసి ఆ వివరాలను మీడియా ముఖంగా వెల్లడిస్తానని వెల్లడించాడు. మీడియా నిజాలు తెలుసుకుని రాయాలని మీరంతా నాకు సహకరించాలని అభ్యర్దించాడు రాజ్‌తరుణ్.

Exit mobile version