Site icon NTV Telugu

Young Rebal Star Prabhas : 12ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్

Prabhas

Prabhas

Young Rebal Star Prabhas : 12ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12ఏళ్ల తర్వాత తన సొంతూరు మొగల్తూరు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పోటెత్తారు. దీంతో ఆ ఊరిలో సందడి వాతావరణం నెలకొంది. తన కుటుంబసభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు.

ప్రభాస్‌ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ‘రెబల్‌స్టార్‌.. రెబల్‌స్టార్‌’ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 2010లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో సంతాప కార్యక్రమాల కోసం ప్రభాస్‌ మొగల్తూరులో వారం రోజులు పాటు ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఆయన ఇప్పుడే వచ్చారు.

ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన సంస్మరణ సభ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ చాలా కాలం తర్వాత అక్కడకు వచ్చారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Ekta Kapoor: నిర్మాత ఏక్తా కపూర్‌కి అరెస్ట్ వారెంట్.. ఆ బూతు సిరీసే కారణం!

మరోవైపు, ప్రభాస్ టీం దాదాపు లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు భోజనప్రియుడు అన్న సంగతి తెలిసిందే. దీంతో, ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. అందులో 25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో భోజనాలు వడ్డించనున్నారు. అభిమానులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కావల్సిన అన్ని చర్యలను ప్రభాస్ టీం చేపట్టింది.

Exit mobile version