NTV Telugu Site icon

Prabhas Movies: ఒకేసారి మూడు సినిమాలు.. దటీజ్ ‘ప్రభాస్’?

Prabhas Movies

Prabhas Movies

‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్‌ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4-5 పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్‌లలో పాల్గొంటుండడం విశేషం. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఉన్నారు. ముందుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నారు. అందుకే వీలైనంత త్వరగా మారుతిని రాజాసాబ్ పూర్తి చేయాలని చెప్పాడట.

Also Read: Jani Master: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!

అయితే రాజాసాబ్ అవకముందే హను రాఘవపూడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు మధురైలో ఫస్ట్ షెడ్యూల్‌ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ లేని సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నారు. ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందని సమాచారం. ప్రభాస్ రాజాసాబ్ చిత్ర షూటింగ్ ముగించుకుని ‘ఫౌజీ’లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇక మరోవైపు కల్కి 2కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్‌ని పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ప్రభాస్ కల్కి2 ని కూడా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు నాగ్ అశ్విన్ మిగతా వర్క్ కంప్లీట్ చేసుకోనున్నాడు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నవారు లేరు. ఇది కేవలం ప్రభాస్‌కి మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు.

Show comments