NTV Telugu Site icon

Nani: ఆ సినిమా ఎవరితో చేస్తారో చేసుకోండి.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Nani Hero

Nani Hero

Hero Nani React on Jersey Sequel: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా ‘జెర్సీ’ నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించారు. 2019లో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రంలో నాని నటన అందరినీ ఆకట్టుకుంది. జెర్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే జెర్సీ మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది.

Also Read: Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. ప్రపంచంలోనే మొదటి క్రికెటర్‌గా..!

అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. కొత్త దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ట్రైలర్‌ ఈవెంట్‌కు హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్‌ ఈవెంట్‌లో నాని మాట్లాడుతుండగా అభిమానులు జెర్సీ సీక్వెల్‌ గురించి అడిగారు. ‘జెర్సీ చిత్రంలో నా పాత్ర పూర్తయింది కదా. జెర్సీ 2 ఎవరితో చేస్తారో చేసుకోండి’ అంటూ నాని సరదాగా అన్నారు. నాని చెప్పిన మాటలను బట్టి చూస్తే జెర్సీ సీక్వెల్ కష్టమే అని అర్ధమవుతోంది. ఎందుకంటే జెర్సీలో నాని పాత్ర చనిపోతుంది.