Site icon NTV Telugu

Hero Nandu: స్వయంగా వండి.. 800 మంది ఆకలి తీర్చిన హీరో నందు!

Hero Nandu

Hero Nandu

Hero Nandu Served Food to 800 People: హీరో నందు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అంతేకాదు టీవీ, స్పోర్ట్స్‌ యాంకర్‌గానూ తన ట్యాలెంట్‌ చూపిస్తున్నాడు. వెండితెరపై అయినా లేదా బుల్లితెరపై అయినా నందు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల నందు నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్‌ సిరీస్‌లకు ఓటీటీల్లో మంచి స్పందన వచ్చింది. హీరోగా, యాంకర్‌గా దూసుకుపోతున్న నందు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. నందు స్వయంగా వండి.. 800 మంది ఆకలి తీర్చాడు.

హీరో నందు తాజాగా కుటుంబంతో కలిసి శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేశాడు. అనంతరం అన్నదానం చేసి ఏకంగా 800 మంది ఆకలి తీర్చాడు. ఈ కార్యక్రమంలో నందు స్వయంగా కూరగాయలు కోసి, కొన్ని వంటకాలు కూడా చేశాడు. అంతేకాదు తానే స్వయంగా వడ్డించాడు కూడా. పాత్రలు కడిగే పనిలోనూ భాగం అతడు భాగం అయ్యాడు. తాజాగా ఈ వీడియోను నందు తన ఇన్‌స్ట్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నందుపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు.

Also Read: Jaya Prada Arrest: జయప్రదను వెంటనే అరెస్ట్‌ చేయండి.. రాంపుర్‌ కోర్టు ఆదేశం!

2006లో ఫోటో మూవీతో నందు సినీరంగ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకూ దాదాపు 25కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. బొమ్మ బ్లాక్ బస్టర్, సవారి, శివరంజని, ఇంతలో ఎన్నెన్ని వింతలో తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే హీరోగా నందుకి సరైన హిట్ పడలేదు. 2014లో సింగర్ గీతా మాధురిని నందు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఐదేళ్ల పాప ఉంది. ప్రస్తుతం గీతా మాధురి రెండోసారి గర్భిణిగా ఉన్నారు. ఇటీవల ఆమె సీమంత వేడుకను నిర్వహించారు. ఇక నందు ప్రస్తుతం ఢీ షోకు యాంకర్‌గా, క్రికెట్‌ యాంకర్‌గా కొనసాగుతున్నాడు.

Exit mobile version