NTV Telugu Site icon

Hero NYX HS500 ER Price: హీరో నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 20తో 100 కిలోమీటర్ల ప్రయాణం!

Nyx Hs500 Er Price

Nyx Hs500 Er Price

Hero Electric Scooter NYX HS500 ER Price and Range in Hyderabad: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలలో ‘హీరో’ కూడా ఒకటి. హీరో కంపెనీ ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదే హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ (Hero Electric NYX HS500 ER). ఈ స్కూటర్‌ ధర తక్కువగానే ఉండడం కాకుండా.. ఫీచర్లు కూడా అదిరిపోయాయి. అందుకే తక్కువ బడ్జెట్ ధరలో మంచి స్కూటర్ కొనాలనుకునేవారికి ఇది మంచి అప్షన్.

NYX HS500 ER Price:
హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ స్కూటర్ ధర రూ. 86,540గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అయితే అధిక డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఈ స్కూటర్ బుకింగ్స్ నిలిపివేశారు. త్వరలోనే ఓపెన్ అవనున్నాయని హీరో పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

NYX HS500 ER Range:
ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. దీని మోటార్ పవర్ 1350 వాట్స్. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ లేదు. డబుల్ బ్యాటరీ ఉన్న ఈ స్కూటర్ కెపాసిటీ 30 ఏహెచ్. ఒక్కసారి చార్జింగ్ పెడితే.. ఈ స్కూటర్ 138 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ తెలిపింది. దీని టాప్ స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు.

Also Read: Gold Today Price: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! తులం పసిడి ఎంత ఉందంటే?

NYX HS500 ER Price Features:
ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రూ. 20 పైసలుతో ఒక కిలోమీటర్ ప్రయాణం చేయొచ్చు. ఈ లెక్కన రూ. 20 ఖర్చుతో 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఇందులో ఇన్‌డ్యాష్ బాటిల్ హోల్డర్, స్ల్పిట్ ఫోల్డింగ్ సీటు, కాంబీ బ్రేక్స్, పోర్టబుల్ బ్యాటరీ, యూఎస్‌బీ పోర్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెలీ స్కోపిక్ సన్సెన్షన్, అలాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి.