Dhanush donates 1 crore to Nadigar Sangam Building: దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణ పనులు 5 ఏళ్ల క్రితమే ప్రారంభం కాగా.. నిధుల కొరత కారణంగా నిర్మాణం సగంలో నిలిచిపోయింది. దాదాపు 60 శాతం పనులు పూర్తికాగా.. 40 శాతం పనులు మిగిలున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.40 నుంచి 50 కోట్లు అవసరమవుతాయని నటీనటుల సంఘం నిర్వాహకులు ప్రకటించారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుని నిర్మాణ పనులు తాజాగా ప్రారంభించారు.
భవన నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని నడిగర్ సంఘం నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు కమలహాసన్ రూ. కోటి విరాళంగా అందించారు. హీరో ఉదయనిధి స్టాలిన్, దళపతి విజయ్ తలా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. హీరో శివకార్తికేయన్ రూ. 50 లక్షలను విరాళం ఇచ్చారు. తాజాగా హీరో ధనుష్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. దీంతో నడిగర్ సంఘం నిర్వాహకులు ధనుష్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: IPL 2024 Playoffs: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ!
సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, నెపోలియన్ తదితరులు కూడా విరాళం ప్రకటించారు. ప్రస్తుతం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా భవనాన్ని పూర్తి చేయనున్నట్లు హీరో విశాల్ ఇటీవల తెలిపారు. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.