NTV Telugu Site icon

Atharvaa:అమలా పాల్‌ ఒక చెత్త హీరోయిన్‌… యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

Ammu

హీరోలు ఎవరినైనా హీరోయిన్స్ గురించి చెప్పమంటే వారిలో ఉన్న పాజిటివ్స్ గురించి మాత్రమే చెబుతారు. స్టార్ హీరోలు సైతం హీరోయిన్స్ గురించి నేరుగా విమర్శించరు. అలాంటిది ఓ యంగ్ హీరో తాను నటించిన హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు అథర్వ మురళీ.

తమిళ చిత్ర పరిశ్రమలో యంగ్‌ హీరోగా కొనసాగుతున్న అథర్వ ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడు. 2010లో ‘బాణకాతాడి’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో తెలుగు సినిమాల్లో అడ్డుపెట్టి ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. 2013లో కోలీవుడ్‌లో విడుదలైన ‘పరదేశి’కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

తాజాగా అథర్వ నటించిన ‘మధకం’ అనే కొత్త వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ హీరోయిన్లలో అమలాపాల్ చెత్త హీరోయిన్ అని అన్నాడు. తన రెండో సినిమా ‘ముహుదుముత్ ఉన్ కర్పనై’లో అమలాపాల్ తో కలిసి నటించానని చెప్పిన అథర్వ తనతో చిన్న గొడవ జరిగిందని చెప్పాడు.

ఆ సమయంలో తనకు చాలా బాధ అనిపించిందని తెలిపాడు. తరువాత ఆ గొడవ సెట్ అయ్యిందని, కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలాపాల్ కే చెప్పానని అథర్వ వెల్లడించాడు. అథర్వ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రసుత్తం కోలివుడ్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై అమలాపాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Show comments